నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచే ఎన్ఐఏ సోదాలు

నిజామాబాద్ జిల్లాలో రాత్రి నుంచే ఎన్ఐఏ సోదాలు

నిజామాబాద్ జిల్లాలో  ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్కాంకు సంబంధించిన కేసులో  తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థకు చెందిన ఇష్యూ ఇటీవల సంచలనం రేపింది.  ఇప్పటికే పలువురు స్కాం కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 4 చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. పీఎఫ్ఐ కేసులో ఇది వరకు అరెస్ట్ అయిన వారు, అలాగే నోటీసులు అందుకున్న వారి ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఆర్మూర్ లోని జిరాయత్ నగర్, పెర్కిట్ లలో  ఎన్ఐఏ సోదాలు జరిగినట్లు సమాచారం. 

బోధన్ లో కూడా మరో బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. కరాటే, సోషల్ అవేర్ నెస్ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తు్న్నారనే అనుమానంతో సోదాలు చేస్తున్నారు. గతంలో పిఎఫ్ ఐ అధ్యక్షుడు షాదుల్లా, ఇమ్రాన్, అబ్దుల్లను పోలీసులు అరెస్ట్  చేశారు. షాదుల్లా, రెహమాన్ లతో పాటు మరో నలుగురిపై దేశ ద్రోహం కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు భైంసా అల్లర్ల కోణంలోను దర్యాప్తు చేస్తున్నారు. విదేశాల నుండి నగదు బదిలీ, అనుమానిత లావాదేవీలపై కూడా తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఎస్ కె నవీద్ కు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.