రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో.. నిందితుడిని పట్టుకున్న ఎన్ఐఏ

రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో.. నిందితుడిని పట్టుకున్న ఎన్ఐఏ

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే సీసీ టీవీలో రికార్డు అయిన  ఫోటోలను విడుదల చేశారు. ఈ క్రమంలో బుధవారం కర్ణాటకలోని బళ్లారికి చెందిన షబ్బీర్‌ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సీసీటీవీలో రికార్డైన వ్యక్తి అతడేనా కాదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అతడిని విచారిస్తున్నారు. 

 కాగా, తూర్పు బెంగళూరులో బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌ లో మార్చి 1న IED పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు.. గ్రూపులుగా విడిపోయి నిందితుడిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.