
నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023ను దక్కించుకున్నారు. 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీ ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో ఈ పోటీని నిర్వహించారు. ప్రస్తుత క్విన్ అండ్ మిస్ యూనివర్స్ 2022 విజేత గాబ్రియెల్ చేతుల మీదుగా షెన్నిస్ కిరీటాన్ని ధరించారు. ఈ పోటీలో ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక భారత్ నుంచి పోటీ పడిన శ్వేతా శారదా సెమీస్‌లో టాప్-20కు అర్హత సాధించారు. కానీ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.
మిస్ యూనివర్స్ 2023
మిస్ యూనివర్స్ ఎంపిక కోసం పోటీలో పాల్గొన్న పార్టిసిపెంట్లు ఈసారి వివిధ దశలను దాటవలసి వచ్చింది. ఇందులో వ్యక్తిగత ప్రకటనలు, ఇంటర్వ్యూలు, గౌన్లు, ఈత దుస్తులలో ప్రదర్శనలు ఇచ్చారు. అత్యంత ఎదురుచూస్తున్న పోటీని జెన్నీ మే జెంకిన్స్, మరియా మెనౌనోస్, మాజీ మిస్ యూనివర్స్ ఒలివియా కల్పో నిర్వహించారు. ప్రసిద్ధ 12 సార్లు గ్రామీ విజేత జాన్ లెజెండ్ కూడా తన సంగీతంతో సమావేశాన్ని ఆకర్షించాడు. ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలో దాదాపు 84 మంది పోటీదారులు పాల్గొన్నారు. దాదాపు 13వేల మంది ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించినట్టు అంచనా.
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! ? ??@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023