అందుకే తెలుగు వారికి ఎక్కువ కనెక్టయ్యాను

అందుకే తెలుగు వారికి ఎక్కువ కనెక్టయ్యాను
  • ‘ఇస్మార్ట్ శంకర్‌‌‌‌‌‌‌‌’తో ఇంప్రెస్‌‌‌‌ చేసిన నిధి అగర్వాల్.. 
  • ‘హీరో’తో కలిసొచ్చి మెస్మరైజ్ చేస్తానంటోంది.
  •  అశోక్‌‌‌‌ గల్లా లీడ్​ రోల్​లో నటించిన ఈ చిత్రం 
  • జనవరి 15న విడుదలవుతున్న సందర్భంగా నిధి చెప్పిన విశేషాలు.

“డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్క్రిప్ట్ ఇంటరెస్టింగ్‌‌‌‌గా, జెన్యూన్‌‌‌‌గా ఉందనిపించింది. స్టోరీలో అన్ని కమర్షి యల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మళ్లీ  డాక్టర్‌‌‌‌‌‌‌‌  క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటించాను. అయితే ఈసారి వెటర్నరీ డాక్టర్‌‌‌‌‌‌‌‌గా. మంచి ఫ్యామిలీ డ్రామా. డార్క్ కామెడీతో పాటు చక్కని ట్విస్టులు కూడా ఉంటాయి. సంక్రాంతికి ఇది పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్ మూవీ. మొదటి సినిమాయే అయినా అశోక్ చాలా బాగా నటించాడు. చాలామంది ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నా అశోక్‌‌‌‌తోనే నాకు ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా చేస్తుండగానే ‘హరిహర వీర మల్లు’లో ఆఫర్ వచ్చింది.  ఆల్రెడీ ఫస్టాఫ్ షూటింగ్  
కంప్లీటయ్యింది. సెకెండాఫ్ త్వరలోనే స్టార్టవు తుంది. నా కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే బెస్ట్ రోల్‌‌‌‌. పవన్ కళ్యాణ్ గారితో నటించడం హ్యాపీగా ఉంది. ఆయన ఉన్నచోట అంతా పాజిటివిటీనే ఉంటుంది. మరికొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి. ఇంకా దేనికీ సైన్ చేయలేదు. హిందీలో ఓ ప్రాజెక్ట్‌‌‌‌కి కమిటయ్యాను. ఏప్రిల్‌‌‌‌లో మొదలవుతుంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌‌‌‌తో నటించిన  సినిమా రిలీజ్‌‌‌‌కి రెడీగా ఉంది. మరో మూవీకి కూడా సైన్ చేశాను. ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమాలకే మొదటి ప్రయారిటీ. అన్ని భాషల్లోనూ నటిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాను. గత చిత్రం కంటే ఈ సినిమాలో ఇంకా బెటర్‌‌‌‌‌‌‌‌గా చేయాలి అని ప్రతిసారీ ఫీలవుతాను. గ్లామరస్ రోల్స్‌‌‌‌తో పాటు డీ గ్లామరస్ పాత్రల్లోనూ నటిస్తున్నాను. యాక్షన్ మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం. ‘హరిహర వీరమల్లు’లో నాకు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. చాలా ఇష్టంగా చేశాను. నేను పుట్టింది హైదరాబాద్‌‌‌‌లోనే. అందుకే తెలుగు వారికే ఎక్కువ కనెక్టయ్యాను. వేరే భాషల్లో నటించినా టాలీవుడ్‌‌‌‌ అంటేనే ఎక్కువ ఇష్టపడతాను.’’