ఈ ఏడాది క్యాపెక్స్ షేర్లదే హవా

ఈ ఏడాది క్యాపెక్స్ షేర్లదే హవా
  • త్వరలోనే మరోసారి బుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రన్‌‌‌‌ మొదలవుతుంది
  •  ఈ ఏడాది క్యాపెక్స్ షేర్లదే హవా
  •  అల్ట్రాటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రాసిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ టీ కొనుక్కోండి: సంజీవ్ భాసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  

న్యూఢిల్లీ: సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌ భాసిన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బుల్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. వచ్చే నెలలోనే నిఫ్టీ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్ హైని టచ్ చేస్తుందని, ఇంకో వారం రోజుల్లోనే నిఫ్టీ 18,000 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకుంటుందని అంచనావేశారు. నిఫ్టీ 17,743 వద్ద సోమవారం క్లోజయ్యింది. ‘18,200 దాటిన తర్వాత నుంచి బుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్ స్టార్టవుతుంది. గుర్తు పెట్టుకోండి, మే లో కొత్త గరిష్టాలకు చేరుకుంటం’ అని ఆయన కుండ బద్దలకొట్టి మరీ చెబుతున్నారు. మే నెల కోసం మూడు  క్యాపెక్స్ షేర్లను  ఎకనామిక్ టైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే.. 

ఇంకో వారంలోనే 18,000 కి..

నిఫ్టీ ఇంకో వారం రోజుల్లోనే 18,000 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టచ్ చేస్తుంది.  మనం అన్ని అంశాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేశాం. 17,500  పివటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, 18,200 తర్వాత నుంచి బుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టవుతుంది. గుర్తుపెట్టుకోండి,  మే నెలలో కొత్త గరిష్టాలను చూస్తాం.   సిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరుగుతున్నాయి.  ఇండియా  మంచి పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది.   మే నాటికి 18,500 చేరువకు వెళతామని నమ్ముతున్నాను. ముఖ్యంగా నిర్దిష్టమైన షేర్ల పెర్ఫార్మెన్స్ కొనసాగుతుందని అంచనావేస్తున్నా. 

ఐసీఐసీఐ బ్యాంక్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి చెప్పాలంటే చాలా బాగున్నాయి.  బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పులివ్వడాన్ని, ఖర్చులను చూడండి.    ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  పీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్, ఐడీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫార్మెన్స్ బాగుండడానికి  కారణం బాండ్ డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్,  క్రూడాయిల్ రేట్లు తగ్గడం.  బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చాలా బాగా 
పనిచేస్తున్నాయి.  


ఈ షేర్లపై ఓ కన్నేయండి..

సిమెంట్ ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి.  కోకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్యూయల్ ధరలు తగ్గడంతో  అల్ట్రాటెక్  సిమెంట్ తయారీ ఖర్చు రెండు నెలల దిగువకు పడింది.  సిమెంట్ ధరలు మరోసారి పెరిగే అవకాశమూ ఉంది. అల్ట్రాటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న గ్రాసిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తోంది. చివరిగా లార్సెన్ అండ్‌‌‌‌ టుబ్రో, తాజాగానే ఈ కంపెనీ డబుల్ డిజిట్ గైడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వాల్యూ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకి చేరుకుంది.   ఈ ఏడాది క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్ల హవా ఉంటుందని అనుకుంటున్నా. అందుకే ఈ షేర్లను కొనాలని సలహాయిస్తున్నా.