ఫెడ్ భయాలు.. స్టాక్ మార్కెట్లో నష్టాలు

ఫెడ్ భయాలు.. స్టాక్ మార్కెట్లో నష్టాలు

స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజు కూడా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  ఇవాళ ఉదయం మార్కెట్ నష్టాలతో మొదలైంది. ట్రేడింగ్ సెషన్ ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 608.8 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 182 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకున్నాయి. అయితే  మళ్లీ గంటలోనే మార్కెట్ కొంత కోలుకుంది. నష్టాలను పూడ్చుకుంది. ఉదయం 10 గంటల 35 నిమిషాల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ మొత్తం 257 పాయింట్లను కోల్పోయి 56,850 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 88 పాయింట్లను కోల్పోయి 16,918 పాయింట్లకు చేరింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనుందనే వార్తల వల్లే మార్కెట్ పతనమైనట్లు తెలుస్తోంది.

రిలయన్స్ స్టాక్ 39 శాతం (రూ.470) నష్టపోయి రూ.2357కు చేరగా, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ 4.10 శాతం (రూ.286) నష్టపోయి  రూ.7238 కు చేరాయి. అత్యధికంగా నష్టపోయిన స్టాక్స్ జాబితాలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐటీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్,ఇండస్ ఇండ్ బ్యాక్ ఉన్నాయి. సన్ ఫార్మా (18 శాతం), మహీంద్రా అండ్ మహీంద్రా (16. 45 శాతం), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (49.40 శాతం), టాటా మోటార్స్ (3.40 శాతం), ఐచర్ మోటార్స్ (25.60 శాతం) గణనీయంగా లాభపడ్డాయి.