
వార్రీ(నైజీరియా): కరోనా వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ విధించినా వినిపించుకోకుండా రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని నైజీరియా మిలటరీ షూట్ చేసింది. నిబంధనలను లెక్క చేయకుండా ఆయిల్ సిటీకి చెందిన జోసఫ్ పెస్సు బయటకు వచ్చాడని, ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బంది అతడిపై కాల్పులు జరపడంతో చనిపోయాడని అధికారులు చెప్పారు. కొందరు యువకులు బయటకు వచ్చి ఆందోళన చేయగా పోలీసులు చెదరగొట్టారు. పెస్సును కాల్చిన వ్యక్తిని ఆర్మీ ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నైజీరియాలో 184 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.