ఫేస్ బుక్ పరిచయం.. మోసపోయిన వ్యాపారి

ఫేస్ బుక్ పరిచయం.. మోసపోయిన వ్యాపారి

హైదరాబాద్ లో  ఓ వ్యాపారికి ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ అమ్మాయి ప్రేమ అంటూ మాయమాటలు చెప్పి నమ్మించి లక్షలు కాజేసింది.  చివరకు ఆ వ్యాపారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్ లో ఓ యాభైఏళ్ల వ్యాపారికి ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. మారియా డోలార్డ్ అనే పేరుతో పరిచయం చేసుకుంది. తాను లండన్ లో ఉంటున్నానని.. తమకు నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయని చెప్పింది. ఇలా కొన్ని రోజులు చాటింగ్ ఫోన్ కాల్స్ నడిచాయి. తనకు భారత సాంస్కృతి నచ్చిందని మీరంటే ఇష్టమని మిమల్ని లవ్ చేస్తున్నానని చెప్పింది. ఇటీవల ఓ రెస్టారెంట్ పై ఉన్న కేసు గెలవడంతో రూ.వంద కోట్లు వచ్చాయని.. ప్రేమకు గిఫ్ట్ గా మీకు రూ. 25 కోట్లు ఇస్తానని ఆ వ్యాపారికి చెప్పింది. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కోసం కొంత కట్టాలని అతడికి చెప్పింది.

దీంతో ఆ యువతి చెప్పింది నిజమే అని నమ్మిన ఆ వ్యాపారి ఆమె చెప్పిన అకౌంట్ కు రూ.17లక్షలకు పైగా పంపించాడు. తర్వాత ఆమె ఫోన్ స్విఛ్చాఫ్ వస్తుంది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యాపారి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు సేకరించిన ఇన్ స్పెక్టర్ గంగాధర్ ఆ ఫోన్ ఢిల్లీ నుంచి వచ్చిందని.. అది నైజీరియన్ల పనేనని  గుర్తించారు.