గుజరాత్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు

గుజరాత్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు

అహ్మదాబాద్: గుజరాత్లో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27 నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తాజాగా కోర్ కమిటీ మీటింగ్లో కరోనా పరిస్థితులపై అధికారులతో చర్చించిన సీఎం భూపేంద్ర పటేల్ నైట్ కర్ఫ్యూను పొడగించాలని నిర్ణయించారు. ఈ మేరకు 8 మెట్రో నగరాలతో పాటు 19 సిటీల్లో రాత్రి పూట కర్ఫ్యూను పొడగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్ కోట్, జామ్ నగర్, జునాగఢ్, భావ్ నగర్, గాంధీ నగర్ ఈ జాబితాలో ఉన్నాయి. గతంలో జారీ చేసిన నైట్ కర్ఫ్యూ ఆంక్షలు ఇవాళ్టితో ముగియనుండటంతో ప్రభుత్వం తాజాగా వాటిని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తల కోసం..

మెరుగుపడిన లతా ఆరోగ్యం.. వెంటిలేటర్ సపోర్ట్ తొలగింపు

ఆంక్షలు సండలించిన కర్నాటక ప్రభుత్వం