సెకండ్ వేవ్: మరో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ

సెకండ్ వేవ్: మరో రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ

పంజాబ్‌లోనూ కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరిగింది.దీంతో అలర్టైన ప్రభుత్వం వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. ఈ టైంలో రాజకీయ సభలు, సమావేశాలపై నిషేధం విధించడంతో పాటు మాల్స్‌, మార్కెట్ల వంటి రద్దీ ప్రదేశాల్లో కూడా ఆంక్షలు ఉంటాయంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు మరోసారి తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్ర, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉందని.. వైరస్‌ కట్టడికి ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర రాత్రి కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు వీకెండ్ లో పూర్తి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. లేటెస్టుగా పంజాబ్ కూడా ఆ లిస్టులో చేరింది.