తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి నైట్ కర్ప్యూ అమలులోకి రానుంది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ కర్ప్యూ అమలులో ఉండనున్నదని సమాచారం. అయితే కర్ప్యూ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు లభించనుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆఫీసులు, షాపులు, రెస్టారెంట్లు, వివిధ సంస్థలు రాత్రి 8 గంటలకు మూసివేయాలని సూచించారు.

నైట్ కర్ఫ్యూ కారణంగా బార్లు, పబ్బులు, రెస్టా‌రెంట్లు మూతపడనున్నాయి. కాగా.. మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సేవలు, గ్యాస్ సర్వీసులు, వాటర్ సప్లై, టెలీ కమ్యూనికేషన్స్, ఇంటర్ నెట్ సర్వీసులు, ఐటీ అండ్ ఐటీ ఇనేబుల్డ్ సర్వీసెస్, ఎలక్ట్రీసిటీ, కోల్డ్ స్టోరేజ్‌లకు మినహాయింపు ఇచ్చారు. డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది వ్యాలిడ్ ఐడీ కార్డుతో ప్రయాణించవచ్చు. అదేవిధంగా ప్రెగ్నెంట్స్, పేషంట్లు అవసరాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చు. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల నుంచి వచ్చే వాళ్లు మరియు వెళ్లే వాళ్లు ప్రయాణానికి సంబంధించిన టికెట్ చూపించి ప్రయాణం చేయవచ్చు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు ఎటువంటి పర్మిషన్ లేకుండా రాష్టంలో మరియు ఇతర రాష్ట్రాలకు వెళ్లవచ్చు. అంతేకాకుండా అత్యవసర విధులకు వెళ్లే వాళ్లను తీసుకెళ్లే ఆటోలు, క్యాబ్‌లకు కూడా అనుమతులిచ్చారు.

నిబంధనలు ఉల్లఘించిన వారిపై డిజాస్టర్ యాక్ట్ 2005లోని సెక్షన్ 51 నుంచి సెక్షన్ 60 వరకు గల చట్టాలు మరియు సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రభుత్వం తెలిపింది.