చిరూ సినిమాలో మరోసారి నిహారికా!

చిరూ సినిమాలో మరోసారి నిహారికా!

ఓ క్రికెట్ టీంకి సరిపోయేంత మంది హీరోలు తమ కుటుంబంలో ఉన్నారని ఆమధ్య ఓసారి చిరంజీవి చమత్కరించారు. ఈ ఫ్యామిలీ నుండి ఓ హీరోయిన్ కూడా ఉందనే విషయం తెలిసిందే. ఇక వీరిలో కొందరు మెగాస్టార్ హీరోగా రూపొందే సినిమాల్లో అతిథి పాత్రలు, కీలక పాత్రలు పోషించడం కొత్తే మీ కాదు. ‘ఆచార్య’సినిమాలో కూడా రామ్ చరణ్ నటించాల్సి ఉంది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ షెడ్యూల్స్ని అనుసరించి అది కుదరొచ్చు, కుదరకపోవచ్చు. చరణ్ మాటెలా ఉన్నా నిహారిక మాత్రం గెస్ట్ రోల్ లో కనిపించబోతోందట. బుల్లితెరపై యాంకర్ గా.. వెండితెరపై
నటిగా.. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసులకు నిర్మాతగా తన మార్క్ చూపిస్తున్న నిహారిక.. తన పెదనాన్న సినిమాలో నటించేందుకు ఎప్పుడూ రెడీ అంటోంది. రీసెంట్గా ‘సైరా నరసింహారెడ్డి’లో నటించింది. ఇప్పుడు ‘ఆచార్య’లోనూ కనిపించబోతోందంట. కరోనా కారణంగా లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ఆపేశారు చిరంజీవి. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ షూటింగ్ మొదలవనుంది. నెక్స్ట్ షెడ్యూల్లోనే నిహారిక జాయిన్ అవుతుందని తెలుస్తోంది. ఆమె నటించడం నిజమే అయితే ‘సైరా’లో గిరిజన యువతిగా కనిపించిన నిహారిక.. ఈసారి మెగాస్టార్ సినిమాలో ఎలా
కనిపించనుందో చూడాలి మరి.

For More News..

రూ. 2 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వ రెండో ప్యాకేజి

కోహ్లీని రెచ్చగొడితే మరింత బాగా ఆడతాడు

ప్రమాదంలో దాదాపు 20 లక్షల జాబ్స్