జగిత్యాలలో నాపై కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి

జగిత్యాలలో నాపై కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి

రీసెంట్ డేస్ లో టాక్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోతో హీరో బాలకృష్ణ రికార్డులు సృష్టించగా..  తాజాగా  సింగర్‌ స్మిత నిజం విత్‌ స్మిత అనే టాక్‌ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలబ్రిటీల వ్యక్తిగత, కెరీర్‌ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్‌లో ప్రసారం కానున్న ఈ షోకు ఫస్ట్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ఈ షోకు సంబంధించి విడుదలైన ఓ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సెలబ్రెటీలకు ఎదురయ్యే విమర్శలు, అవమానాల గురించి స్మిత చిరును ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. జగిత్యాలలో కొందరు అభిమానులు తనపై పూల వర్షం కురిపిస్తే, కొందరు కోడిగుడ్లు కూడా విసిరారంటూ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పారు. ఇంతకీ చిరుపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు? అని అభిమానులంతా ఆతృతగా ఎదురుచూసేలా ఈ ప్రోమో ఉంది. చిరు కెరీర్‌ ఎలా మొదలైంది? ఫస్ట్‌ క్రష్ ఎవరు‌? సినీ పరిశ్రమపై అభిప్రాయం తదితర ఎన్నో ఆసక్తికర విషయాల గురించి చిరు ఈ షోలో మాట్లాడినట్లు తెలుస్తోంది.  నిజం విత్ స్మితలో మెగాస్టార్‌ పంచుకున్న ఆసక్తికర విషయాల గురించి తెలియాలంటే ఫిబ్రవరి 10 వరకు వేచి చూడాల్సిందే.