నా టార్గెట్ ఒలింపిక్స్

నా టార్గెట్ ఒలింపిక్స్

2024 ఒలింపిక్స్లో పతకం సాధించడమే లక్ష్యమంటోంది ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్​షిప్ విజేత నిఖత్​ జరీన్.  ఇది ఆరంభం మాత్రమేనని..ఇంకా సాధించాల్సింది చాలా ఉందని చెప్పింది. స్వర్ణ పతకం గెలవడంతోనే తన ప్రయాణం ఆగిపోదని... దేశ ప్రజలు గర్వపడేలా మరిన్ని పతకాలు సాధిస్తానని వెల్లడించింది. ఎంతో మంది మహిళలు..వివిధ క్రీడల్లో రాణిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారని పేర్కొంది. వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ చాంపియషిప్లో స్వర్ణ పతకం సాధించడం తన జీవితంలో మరిచిపోలేని సందర్భమని తెలిపింది. ఈ విజయాన్ని స్నేహితులు, కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నానని వెల్లడించింది.   ప్రస్తుతం తన దృష్టి కామన్ వెల్త్ గేమ్స్ పైనే ఉందని నిఖత్ జరీన్ చెప్పింది.