
సోఫియా: స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (52 కేజీ) నేరుగా క్వార్టర్స్ నుంచి తన పోరాటాన్ని స్టార్ట్ చేయనుంది. ఆమెకు ఫస్ట్ రౌండ్‌లో బై లభించింది. ఆదివారం మొదలైన ఈ మెగా టోర్నీలో మిగతా ఇండియన్స్‌కు టఫ్ డ్రా ఎదురైంది. సుమిత్ (75 కేజీ), అంజలి తుషీర్ (66 కేజీ)కు ఓపెనింగ్ రౌండ్స్‌లో టఫ్ అపోనెంట్స్ ఎదురుకానున్నారు. ఫస్ట్ రౌండ్‌లో అంజలి.. రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ మెడలిస్ట్ సడాట్ డల్గాటోవా (రష్యా)ను ఎదుర్కోనుంది. నిఖత్‌తో పాటు నందిని (+81) కూడా డైరెక్ట్‌గా క్వార్టర్స్ నుంచి ఆడనుంది. మెన్స్ కేటగిరీలో ఆకాశ్ (67 కేజీ)కు ఫస్ట్ రౌండ్ బై లభించింది. సుమిత్.. వరల్డ్mచాంపియన్‌షిప్ సిల్వర్ మెడలిస్ట్ జంబులాత్ బిజామోవ్ (రష్యా)తో తలపడనున్నాడు.