
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ(Nikhil Siddhartha) వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల కార్తికేయ 2తో(Karthikeya 2) పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ హీరో.. ఆ తరువాత వచ్చిన స్పై(Spy) మూవీతో ఆడియన్స్ ను కాస్త డిసప్పాయింట్ చేశాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో క్రేజీ అండ్ పీరియాడిక్ ప్రాజెక్టు తో మనముందుకు రానుంన్నాడు. అదే స్వయంభు(Swayambhu). నిఖిల్ పుట్టినరోజు సంధర్బంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
The Journey Begins #Swayambhu
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 18, 2023
@iamsamyuktha_ @krishbharat20 @RaviBasrur @manojdft @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/9ar6yG7vyO
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు కెమెడీ అండ్, సీరియస్ థ్రిల్లర్ సినిమాలు చేసిన నిఖిల్.. ఇలాంటి వీరయోధుడి పాత్ర చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ స్వయంభు సినిమాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆగస్టు 18 నుండి నుంచి స్వయంభు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నిఖిల్ మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. యుద్ధభూమిలో గుర్రం మీద ఎక్కి బాణాలు సంధిస్తూ ఉన్న నిఖిల్ లుక్ అదిరిపోయింది.
ఇక స్వయంభు సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తుండగా.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.