70th National Film Awards 2024: తెలుగు సినిమాకి జాతీయ అవార్డు..

70th National Film Awards 2024: తెలుగు సినిమాకి జాతీయ అవార్డు..

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను (70th National Awards 2024) కేంద్ర ప్రభుత్వం శుక్ర‌వారం (ఆగస్ట్ 16న)  ప్ర‌క‌టించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలు అందిస్తున్నారు.

తాజాగా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శక‌త్వంలో కార్తికేయకి మూవీ సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ‌ 2 సినిమాకి జాతీయ అవార్డు వరించింది. తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ‌ 2 నిలిచింది. కాగా ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. కార్తికేయ‌ 2 సినిమాకి జాతీయ అవార్డు రావడంతో చిత్రబృందానికి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి.

కార్తికేయ 2 విశేషాలు:

కార్తికేయ(Karthikeya) సినిమా హీరో నిఖిల్(Nikhil) కెరీర్ లో ఎంత ప్రత్యేకమో చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు అటా.. ఇటా అన్నట్టుగా సాగుతున్న ఆయన ప్రయాణం ఈ సినిమాతో మలుపు తిరిగింది. దర్శకుడు చందు మొండేటి(Chandu Mondeti) తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. డివోషనల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 3 కూడా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన కార్తికేయ2 సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకృష్ణుడి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా బాగా ఆకట్టుకుంది.దీంతో బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హీరో నిఖిల్ కు పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.