పెళ్లికి వెళ్లొస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. 9 మంది మృతి

పెళ్లికి వెళ్లొస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. 9 మంది మృతి

రాజస్థాన్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝలావర్ జిల్లా అక్లెరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ట్రక్ వేగంగా వచ్చి వ్యాన్‌ను ఢీకొట్టింది. కనీసం తొమ్మిది మంది మరణించారు. దుంగార్‌గావ్‌కు చెందిన బాబ్రీ కమ్యూనిటీ వాళ్లు బంధువుల పెళ్లికి వెళ్లి వస్తున్నారు. పెళ్లి తర్వాత ఊరేగింపు నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో వ్యాన్ ను ట్రక్ ఢీకొట్టింది. ప్రమాద సమాచారం అందుకున్న అక్లెరా పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఈ యాక్సిడెంట్ లో వ్యాన్ లో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు. 

మృతదేహాలను అక్లెరా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులంతా వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారు. అక్లెరా సమీపంలోని దుంగార్ గ్రామానికి చెందిన బగ్రీ కమ్యూనిటీ ప్రజలు శనివారం తమ బంధువు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లారని, పెళ్లి ఊరేగింపు నుంచి బయలుదేరుతుండగా, వారి వ్యాను వేగంగా వచ్చిన ట్రాలీ ఢీకొట్టిందని అక్లెరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సందీప్ బిష్ణోయ్ తెలిపారు.