నిర్భయ దోషికి షాక్.. పిటిషన్ వేసిన కొన్ని గంటల్లోనే తిరస్కరణ

నిర్భయ దోషికి షాక్.. పిటిషన్ వేసిన కొన్ని గంటల్లోనే తిరస్కరణ

మరణశిక్షను వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు చట్టాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. నలుగురు నిర్భయ దోషుల్లో ముకేశ్ కుమార్ సింగ్(32),వినయ్ కుమార్ శర్మ(26),అక్షయ్ కుమార్(31) ఇప్పటికే న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకున్నారు. అయితే వీరిలో ఒకడైన పవన్ గుప్తా తాజాగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. తనకు విధించిన ఉరి శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని క్యూరేటివ్ పిటిషన్ వేయగా… సుప్రీం ఆ పిటిషన్ ను కొట్టేయడంతో రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు.

అయితే ఈ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు.  ఉరిపై స్టే విధించాలని వేసిన అతని పిటిషన్ పై పటియాలా హై కోర్టు రిజర్వ్ లో ఉంచింది. దీంతో రేపు ఉదయం  6గంటలకు నిర్భయ దోషులకు  ఉరిశిక్ష అమలుపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.