నిర్భయ దోషిపై జైలులో రేప్!

నిర్భయ దోషిపై జైలులో రేప్!

తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ దోషి ముకేశ్ సింగ్ వేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ ఉదయం వాదనలు ఉన్న కోర్టు తీర్పును బుధవారం వెల్లడించనుంది. అయితే న్యాయస్థానంలో విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది అంజనా ప్రకాశ్ వింత వాదనను తెరపైకి తెచ్చారు. ఢిల్లీలో 2012 డిసెంబరు 16న జరిగిన నిర్భయ రేప్, మర్డర్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైలులో పెట్టిన తన క్లయింట్‌ ముకేశ్‌పై అక్కడ అత్యాచారం జరిగిందని చెప్పారు. నిర్భయ కేసులో మరో ఖైదీ అయిన అక్షయ్‌ చేత ముకేశ్‌పై 2013 నుంచి బలవంతంగా రేప్ చేయిస్తున్నారని ఆరోపించారు. తీవ్రంగా హింసించారని చెప్పారు. దాదాపు ఐదేళ్లుగా అతడికి నిద్ర లేదని చెప్పారు. అతడికి కోర్టులు వేసిన శిక్ష ఉరి తీయాలనే కానీ, రేప్ చేయాలని కాదంటూ వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని దయతో అతడికి క్షమాభిక్ష పెట్టాలని వాదించారు లాయర్ అంజనా ప్రకాశ్.

ముకేశ్ తరఫు లాయర్ వాదనలను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పుబట్టారు. జైలులో అలా జరిగిందనడానికి ఆధారమేంటని ప్రశ్నించారు. ఒకవేళ అది నిజమే అయినా కూడా ఈ కారణంతో క్షమాభిక్ష పెట్టాలని రూల్ ఏమీ లేదన్నారు. ఉరి అమలులో ఆలస్యం చేయడానికి కొత్త కొత్త వాదనలనుతెరపైకి తెస్తున్నారని అన్నారు. వేగంగా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడమంటే ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయంగా చూడలేమన్నారు. ఇంకా నిర్భయ దోషుల ఉరిని వాయిదా వేస్తూ పోతే ఇది అమానవీయ చర్యగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

More News:

నిర్భయ దోషుల ఉరి లైవ్ టెలికాస్ట్ చేయండి: కేంద్రానికి ఎన్జీవో లేఖ

నిర్భయ దోషుల్లో చావు భయం: చివరి కోరికపై అధికారుల ప్రశ్న

నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా పడే చాన్స్