ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

నిర్మల్, వెలుగు : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని నిర్మల్ అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివిధ అంశాలపై రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలెక్టరేట్​లో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ధాన్యం కొన్న తర్వాత సకాలంలో మిల్లులకు తరలించాలని, కొనుగోలు వివరాలను ఖచ్చితంగా ట్యాబ్​లో ఎంట్రీ చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే  రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎం సివిల్ సప్లయిస్ శ్రీకళ, డీఎస్​వో నందిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొనుగోళు సెంటర్ల పరిశీలన

లక్ష్మణచాంద : లక్ష్మణచాంద మండలంలో రాచాపూర్, పీచర, ధర్మారం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ కిషోర్​కుమార్​ పరిశీలించారు. సెంటర్లలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లర్లకు పంపించాలని, కొనుగోళ్లలో వేగం పెంచాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ జానకి తదితరులున్నారు.