నిర్మల్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య

నిర్మల్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య
  •     కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్, వెలుగు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడంతోపాటు మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు. 

మండలాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ దాదాపు పూర్తయిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. విస్తృతస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి స్కూళ్లు, హాస్టళ్లు, కిచెన్​లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విసమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.

 విత్తన దుకాణాల్లో కలెక్టర్ తనిఖీలు

సోన్ మండల కేంద్రంలోని బాలకిషన్ ఫర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్​భవేశ్​మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలోని ఎరువులు, విత్తనాల స్టాక్, క్రయవిక్రయాల రిజిస్టర్లను పరిశీలించారు. క్రయవిక్రయాలకు సంబంధించిన రికార్డులన్నీ పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. అంతకుముందు డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ సంతోష్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.