
నిర్మల్, వెలుగు: తాగుడు కు బానిసై అనారోగ్యంతో మరణించిన ఓ తండ్రికి 11 ఏండ్ల కూతురు తలకొరివి పెట్టింది. మహారాష్ట్రలోని హిమాయత్ నగర్‌కు చెందిన సంతోష్‌కు ఓ కూతురు ఉంది. కొన్నేండ్ల క్రితం సంతోష్‌ను భార్య వదిలి వెళ్లిపోయింది. దీంతో సంతోష్ కూలీ పనుల కోసం నిర్మల్‌కు వచ్చాడు. ఆయన కూతురు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. సంతోష్ చనిపోయిన విషయం తెలుసుకున్న కూతురు సోమవారం నిర్మల్‌కు వచ్చింది.
కానీ అంత్యక్రియలకు ఆమె వద్ద నయా పైసా లేదు. విషయం తెలుసుకున్న భైంసాకు చెందిన ఐక్యత సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు నిర్మల్ కు వచ్చి కూతురితో తండ్రి అంత్యక్రియలు చేయించారు.