మరోసారి మీడియా ముందుకు నిర్మలా సీతారామన్‌

మరోసారి మీడియా ముందుకు నిర్మలా సీతారామన్‌
  • ప్యాకేజీ కేటాయింపులను ప్రకటించేందుకు
  • సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్‌మీట్

‌న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివిరాలను చెప్పేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి మీడియా ముందుకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మాట్లాడతారని అధికారులు చెప్పారు. ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం దశల వారీగా ప్రకటిస్తోంది. రెండో రోజు గురువారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో 3.16 లక్షల కోట్లు కేటాయించారు. దానిలో 2లక్షల కోట్లతో రైతులకు లోన్లు, వలస కూలీలు, వీధి వ్యాపారులకు ఆసరా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ్టి కేటాయింపులు ఏంటో తెలియాల్సి ఉంది.