
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వరుసగా రెండోసారి ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం… తమ తొలి బడ్జెట్ ను ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ .. మోడీ 2.0 గవర్నమెంట్ కు సంబంధించిన మొట్టమొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి ఆర్థిక శాఖ తొలి మహిళా మంత్రిగా నిర్మల సీతారామన్ రికార్డ్ సృష్టించారు.
మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో సాధించిన ప్రగతిని ముందుగా నిర్మల వివరించారు. రాబోయే ఐదేళ్లలో తమ ప్రణాళికలు ఎలా ఉంటాయో తెలిపారు. గత ఐదేళ్లలో తీసుకున్న ఆర్థిక సంస్కరణలు ఈ ఐదేళ్లలో అద్భుత ఫలితాలను ఇవ్వబోతున్నాయని ఆమె తెలిపారు.