ట్యాక్స్ వేయకుంటే ధరలను నియంత్రించలేం

ట్యాక్స్  వేయకుంటే ధరలను నియంత్రించలేం

వ్యాక్సిన్లు,మందులు, ఆక్సిజన్ ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సిన్లు, సంబంధిత మందులు, ఆక్సిజన్ పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రధానికి రాసిన లేఖపై నిర్మలా సీతారామన్ స్పందించారు. వ్యాక్సిన్ పై 5 శాతం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మందులపై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. జీఎస్టీని పూర్తిగా మినహాయింపునిస్తే దేశీయ తయారీదారులు రా మెటిరీయల్స్, సేవలకు చెల్లించిన ట్యాక్సులను తిరిగి రాబట్టుకోలేక వాటి ధరలను పెంచుతారంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే రెమ్ డెసివిర్,  దాని రా మెటిరీయల్స్ వంటి మందులపై దిగుమతి సుంకాలు, ఐజీఎస్టీ తగ్గించామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని, దానికి కేంద్రమే ట్యాక్స్ చెల్సిస్తోందన్నారు నిర్మలా. వసూలైన జీఎస్టీ మొత్తం సగం మళ్లీ రాష్ట్రాలకే వెళ్తొందన్నారు.