నిర్మలా సీతారామన్ అన్నీ అబద్దాలే మాట్లాడారు

నిర్మలా సీతారామన్ అన్నీ అబద్దాలే మాట్లాడారు

రేషన్ షాపుల్లో సరుకులు సక్రమంగా వస్తున్నాయా అని అడగాలి.. కానీ మోడీ ఫొటో లేదని అడుగుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు మోడీ ఫొటో ఎందుకు పెట్టాలి ? ఏం చేశారు అని ప్రశ్నించారు. వార్డు సభ్యుల్లాగా నిర్మలా ప్రవర్తించారని విమర్శించారు. అందరి కేంద్ర మంత్రుల్లాగే ఈమె మాట్లాడిన తీరుతో తెలంగాణ ప్రజలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. ఇటీవలే కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.

దీనిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిపై మాట్లాడుతారని అనుకుంటే.. అన్ని అబద్ధాలే చెప్పారని విమర్శించారు. చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు నరనరాన తెలంగాణపై వ్యతిరేకత ఉందని వెల్లడించారు. దేశ జీడీపీ పెంచమంటే గ్యాస్, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నారన్నారు. ‘డీపీఆర్ అంటే కూడా కేంద్ర మంత్రికి తెలియదు.. డీపీఆర్ అంటే డీటైల్డ్ ప్రాజెక్ట్ అని అర్ధం.. కానీ నిర్మలమ్మ డ్రాఫ్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్తోంది’ అని విమర్శించారు.