నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర షురూ

నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర షురూ

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను కాంగ్రెస్​ షురూ చేసింది. ఈ యాత్ర ‘మిషన్​ నిరుద్యోగి’ పేరిట రెండు బస్సుల్లో పది రోజుల పాటు 100 నియోజకవర్గాల్లో జరగనుంది. బుధవారం గన్​పార్క్​ నుంచి ప్రొఫెసర్​ హరగోపాల్​ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. నిరుద్యోగులతో పాటు కాంగ్రెస్​ నేతలు అజయ్​కుమార్, అద్దంకి దయాకర్, రియాజ్, చరణ్​ కౌశిక్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు. 

ప్రొఫెసర్​ హరగోపాల్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని తెలిపారు. పదేండ్లలో కేసీఆర్​ సర్కార్​ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఉద్యోగ ప్రకటనలు ఆశించినంతగా రాలేదన్నారు. జరిగిన పలు పోటీ పరీక్షలనూ సరిగ్గా నిర్వహించలేకపోయిందని ఫైర్​ అయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులు పల్లెల్లోకి వెళ్లి ప్రజలకు నిజాలు చెప్పాలని కోరారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమేనని హరగోపాల్ పేర్కొన్నారు.