వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో నిశాంత్‌‌‌‌‌‌‌‌

వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో నిశాంత్‌‌‌‌‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌: వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా యంగ్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌ నిశాంత్‌‌‌‌‌‌‌‌ దేవ్‌‌‌‌‌‌‌‌  ప్రిక్వార్టర్స్ చేరాడు.  మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ 71 కేజీ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో నిశాంత్‌‌‌‌‌‌‌‌.. మంగోలియా బాక్సర్ ఒట్గోన్‌‌‌‌‌‌‌‌బాటర్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేశాడు. ఈ బౌట్‌‌లో నిశాంత్  తన ప్రత్యర్థిపై పంచ్‌‌‌‌‌‌‌‌ల వర్షం కురిపించాడు. దీంతో రెండు నిమిషాల్లోనే  బౌట్ ఆపిన రిఫరీ ఇండియా బాక్సర్‌‌‌‌ను విన్నర్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించాడు. 57 కేజీ కేటగిరీలో సచిన్ సివాచ్ 5–0తో   ఫ్రెడ్రిక్ జెన్సెన్ (డెన్మార్క్‌‌)పై విజయం సాధించగా,  63.5 కేజీల్లో అభినాష్‌‌‌‌‌‌‌‌ జమ్వాల్‌‌‌‌‌‌‌‌  0–5తో జోస్‌‌‌‌‌‌‌‌ వయఫరా (కొలంబియా) చేతిలో ఓడాడు.