
హైదరాబాద్, వెలుగు: ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యంగ్ జిమ్నాస్ట్ నిష్క అగర్వాల్ రెండు గోల్డ్ సహా మూడు మెడల్స్‌తో సత్తా చాటింది. ఢిల్లీలో శనివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో నాలుగు ఈవెంట్లలో పోటీ పడ్డ నిష్క మూడింటిలో పతకాలు గెలిచింది. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగంలో 11.433 స్కోరుతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ నెగ్గిన ఆమె, వాల్టింగ్ టేబుల్‌లో 12.883 స్కోరుతో మరో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. బ్యాలెన్సింగ్ బీమ్ లో 10.967 స్కోరుతో రెండో ప్లేస్‌తో సిల్వర్ గెలిచింది.