ఎంత మంచి మనస్సు : నీతా అంబానీకి 60 ఏళ్లు.. పేద పిల్లలకు భోజనం పెట్టారు

ఎంత మంచి మనస్సు : నీతా అంబానీకి 60 ఏళ్లు.. పేద పిల్లలకు భోజనం పెట్టారు

దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య, మహిళా వ్యాపారవేత్త, నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నీతా అంబానీ  నవంబర్ 1న  60 వ వసంతంలోకి అడుగు పెట్టారు.  నీతా అంబానీ తన  బర్త్ డే ను  ముంబైలోని  నిరుపేద పిల్లలతో జరుపుకోవడం విశేషం. 

నీతా అంబానీ బుధవారం తన 60 పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని  అన్న సేవలో 3 వేల  మంది నిరుపేద పిల్లలకు భోజనం పెట్టారు. వారితో  కలిసి  కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. అంతేగాకుండా దేశ వ్యాప్తంగా 1.4 లక్షల మందికి అన్న సేవ నిర్వహించారు. దేశంలోని 15 రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు వేడి వేడి భోజనం అందించారు.  కొందరికి  రేషన్ కిట్‌లు పంపిణీ చేశారు. 

నిరుపేదలతో నీతా అంబానీ బర్త్ డే వేడుకలు జరుపుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీతా అంబానీది ఎంతో గొప్ప మనసో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దేశంలోనే అపర కుభేరుడి భార్య అయినా.. చాలా సింపుల్ గా పేదపిల్లలతో కలిసి బర్త్ డే జరుపుకొని మంచి మనసు చాటుకుందంటున్నారు.

నీతా అంబానీ  ముంబైలోని  అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కు ఛైర్ పర్స్ న్ గా ఉన్నారు.  అలాగే ఐపీఎల్లో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆమె  కో ఫౌండర్.  అంతర్జాతీయ ఒలింపిక్  కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ కూడా నీతానే.  1985లో ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ  కుమార్తె ఇషా అంబానీ ఉన్నారు.