మిస్ వరల్డ్ పోటీల్లో నీతా అంబానీకి అవార్డ్

మిస్ వరల్డ్ పోటీల్లో  నీతా అంబానీకి  అవార్డ్

ఇండియాలో 28 సంవత్సరాల తర్వత 71వ ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. ఇందులో 115 దేశాల నుంచి యువతులు పోటీ పడ్డారు. 71వ  మిస్ వరల్డ్ పోటీలు శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో  జరిగాయి. ఈ పోటీల్లో చెక్ రిపబ్లికక్ కు చెందిన  24 ఏళ్ల క్రిస్టినా పిస్జ్‌కోవా  మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ వేడుకల్లో రిలయన్స్  ఛైర్ పర్సన్ నీతా అంబానీ  హ్యుమానిటేరియన్ అవార్డును  పొందారు.  

ALSO READ :- Rohan Roy Remuneration: రోహన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఒక్కో ప్రాజెక్టుకి లక్షల్లో!

మిస్ వరల్డ్ ఈవెంట్‭లో భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టులో వచ్చారు. గోల్డ్ కలర్ జరీ పట్టు  బనారసీ చీర అందరి దృష్టిని ఆకర్షించింది. నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈ అవార్డ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం తన ఒక్కరిది కాదని ఈ గౌరవం మనందరి విజయమని అన్నారు. భారతీయ గొప్పదనం, మహిళలు సాధికారత గురించి మాట్లాడారు.