
టాలీవుడ్ హీరో నితిన్(Nithin) నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ అనే సినిమా..డిసెంబర్ 8న థియోటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. నితిన్ కు జోడిగా శ్రీ లీల(Sreeleela) నటించింది. అయితే ఓలే ఓలే పాపాయి అనే పాట ప్రోమోను చిత్ర బృందం రీసెంట్ గా విడుదల చేయగా..ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ పాటలో నితిన్ శ్రీలీల ఇద్దరూ మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. నితిన్ ప్రతి సినిమాలో కూడా తనదైన డాన్స్ తో డిఫరెంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక అతనికి జోడిగా శ్రీలీల కలవడంతో..వీరి కలయిక థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా ఉందని అనిపిస్తోంది. ఈ సాంగ్ ను హరీష్ జయరాజ్ కంపోజ్ చేయగా..రామ్ మిరియాల పాడారు. ఓలే ఓలే పూర్తి పాట డిసెంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారు.
‘ఎక్స్‌ట్రా’ ఆర్డినరీ మ్యాన్ లో హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.