డీజిల్ ​వెహికల్స్​పై .. అదనపు జీఎస్​టీ ప్రపోజల్​ లేదు

డీజిల్ ​వెహికల్స్​పై .. అదనపు జీఎస్​టీ ప్రపోజల్​ లేదు
  • గడ్కరీ క్లారిఫికేషన్
  • ఇథనాల్​, గ్రీన్​ హైడ్రోజన్​ వంటివి వాడాలని సూచన 

న్యూఢిల్లీ: పొల్యూషన్​ తగ్గించే క్రమంలో డీజిల్​ వెహికల్స్​పై అదనంగా 10 శాతం జీఎస్​టీ విధించాలనే ప్రపోజల్​ ఉందని తాను కామెంట్​ చేసినట్లు వచ్చిన వార్తలను గడ్కరీ ఖండించారు. సియామ్​ యాన్యువల్​ కన్వెన్షన్​లో పాల్గొన్న తాను డీజిల్​ వెహికల్స్​ కారణంగా పొల్యూషన్​ ఎక్కువవుతోందనే కామెంట్​ చేసినట్లు గడ్కరీ స్పష్టం చేశారు. కానీ, గడ్కరీ వ్యాఖ్యలు వైరల్​ కావడంతో స్టాక్ మార్కెట్లో ఆటోమొబైల్​ షేర్లు నష్టాలపాలవడమే కాకుండా, కొన్ని గంటలపాటు గందరగోళం నెలకొంది. ఈ అయోమయాన్ని తొలగించేందుకు గడ్కరీ ఆ తర్వాత, డీజిల్​ వెహికల్స్​పై అదనపు జీఎస్​టీ ప్రపోజల్ ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ట్వీట్​ చేశారు.

కాలుష్యం తగ్గించడానికి క్లీనర్​ ఫ్యూయెల్స్​ వాడటం మేలని గడ్కరీ సూచించారు. 2070 నాటికి కార్బన్​ నెట్​ జీరో లక్ష్యాన్ని అందుకునే దిశలో ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా డీజిల్​ వెహికల్స్​ ఎక్కువగా పొల్యూషన్​కు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఇంధనాల వినియోగం బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గాలని, ఇందుకోసం దేశంలోనే తగిన ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్స్​పై ఫోకస్​ పెట్టాలని కూడా సూచించారు. పన్నులు పెంచితే డీజిల్​ వెహికల్స్​ విక్రయించడం కష్టమవుతుందనే అర్ధం వచ్చేలా గడ్కరీ మాట్లాడినట్లు రిపోర్టులు వచ్చాయి.

ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్స్​పై ఫోకస్​ పెంచండి

దేశంలోని చాలా కమర్షియల్​ వెహికల్స్​ ప్రధానంగా డీజిల్​తోనే నడుస్తున్నాయి. దీంతో గడ్కరీ చేసినట్లుగా చెబుతున్న కామెంట్స్​ కొంత సంచలనం సృష్టించాయి. పాసింజర్​ వెహికల్స్​ కేటగిరీలో డీజిల్​కార్ల అమ్మకాలను మారుతి సుజుకి ఇండియా, హోండా కంపెనీలు నిలిపివేశాయి. డీజిల్​ కార్ల సంఖ్య తగ్గిందని, మాన్యుఫాక్చరర్లు వాటిని అమ్మకుండా ఉంటే మేలని ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్  అభిప్రాయపడ్డారు. తన ఇంధన అవసరాలను ప్రధానంగా డీజిల్​, పెట్రోల్​ వంటి ఫాజిల్​ ఫ్యూయెల్స్​ ద్వారానే ఇండియా నెరవేర్చుకుంటోందని, ఈ కారణంగా రెండు సవాళ్లను దేశం ఎదుర్కోవల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఒకటి ఆర్థికపరమైన సవాలైతే రెండోది కాలుష్యమని వివరించారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​తోపాటు,  బయో ఫ్యూయెల్స్​, ఇథనాల్​, గ్రీన్​ హైడ్రోజన్​ వంటి ఆల్టర్నేటివ్​ ఇంధనాల వినియోగం పెరగాలని చెప్పారు. దేశంలో రోడ్లను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని మంత్రి పేర్కొన్నారు.  ఆటో మొబైల్​ ఇండస్ట్రీ  ఏటా 15 నుంచి 18 శాతం చొప్పున గ్రోత్​ సాధిస్తోందని, ఫాజిల్​ ఫ్యూయెల్స్​ వినియోగం ఎక్కువవడానికి ఇది కూడా కారణమవుతోందని అన్నారు. ఈ గ్రోత్​ ఆటోమొబైల్​ ఇండస్ట్రీకి ఆనందం కలిగిస్తుందని, కానీ పొల్యూషన్​ వల్ల ప్రజలు బాధితులవుతారని గడ్కరీ పేర్కొన్నారు. అందుచేత, వీలైనంత తొందరగా పెట్రోల్​, డీజిల్​ వంటి ఇంధనాలకు గుడ్​బై చెప్పమని ​కంపెనీలను ఆయన కోరారు. దేశంలో ప్రస్తుతం ఆటోమొబైల్​ వెహికల్స్​పై 28 శాతం జీఎస్​టీ విధిస్తున్నారు. కాంపెన్సేషన్​ సెస్​ 22 శాతం దాకా ఉన్న విషయం తెలిసిందే. ఇథనాల్​ వంటి ఎకో ఫ్రెండ్లీ ఇంధనాలపై దృష్టి పెట్టమని ఆటోమొబైల్​ పరిశ్రమను గడ్కరీ కోరారు.