
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి బ్లాక్ ఫంగస్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమందిలో కరోనా రాకున్నా బ్లాక్ ఫంగస్ వస్తుందని తెలిపారు నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్. మధుమోహం అదుపులో లేని వారికి ఇది సోకుతుందని చెప్పారు. అటు రక్తంలో షుగర్ లెవల్స్ 700కు చేరినప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తుందని నిపుణులు చెప్పినట్లు తెలిపాడు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి నిమోనియా, ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నట్లు తెలిపాడు వీకే పాల్.