థర్డ్ ఎడిషన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టు రిలీజ్

థర్డ్ ఎడిషన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టు రిలీజ్
  • నీతి ఆయోగ్ థర్డ్ ఎడిషన్ ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టు
  • నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ పొజిషన్‌‌‌‌లో మళ్లీ కర్నాటక..
  • కొండ ప్రాంత రాష్ట్రాల్లో మణిపూర్ టాప్‌‌‌‌

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నీతి ఆయోగ్ విడుదల చేసిన థర్డ్ ఎడిషన్ ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్టులో తెలంగాణ సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకుంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐలను, వెంచర్ క్యాపిటలిస్టులను ఆకర్షించడం, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రొత్సహించే ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేయడం, వ్యవస్థలోని సమస్యలను కొత్త విధానాలతో పరిష్కరించడం వంటి 66 యూనిక్  ఇండికేటర్లను పరిశీలించి   ‘ఇండియా ఇన్నొవేషన్ ఇండెక్స్ 2021’ ను నీతి ఆయోగ్ విడుదల చేసింది. 17 పెద్ద రాష్ట్రాలు, 10 నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కొండ ప్రాంతాల్లోని రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు,  సిటీ రాష్ట్రాలు (సిటీనే రాష్ట్రం)..ఇలా దేశంలోని రాష్ట్రాలను  మూడు కేటగిరీల కింద వేరు చేసి  ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇచ్చారు. కొత్త ఆవిష్కరణలు క్రియేట్ అవ్వడానికి సాయపడే వాతావరణం రాష్ట్రాల్లో ఉందో లేదో  తెలుసుకోవడానికి ఈ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నీతి ఆయోగ్ విడుదల చేస్తోంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇనొవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేస్తున్నారు.  
మళ్లీ కర్నాటక టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..
17 పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కర్నాటక వరసగా మూడోసారి టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. తర్వాత ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఒడిశా, బిహార్ రాష్ట్రాలు ఇన్నొవేషన్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చివరి మూడు ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉన్నాయి.  ఆంధ్ర ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొమ్మిదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.  విదేశీ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను, వెంచర్ క్యాపిటలిస్టులను ఆకర్షించడంలో కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, అందుకే ఈ రాష్ట్రాలకు ఎక్కువ స్కోర్ దక్కిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  ఇంటర్నెట్ వాడుతున్నవారు ఎక్కువగా ఉండడంతో ఇన్నొవేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  హర్యానా, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలు క్రియేట్ చేసుకోగలిగాయని, మరిన్ని ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించేలా సురక్షితమైన ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ రాష్ట్రాలు డెవలప్ చేసుకోగలిగాయని నీతి ఆయోగ్ వివరించింది. అందుకే ఈ రాష్ట్రాలు తమ ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మెరుగుపరుచుకోగలిగాయని తెలిపింది. 
అటు చంఢీగడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇటు మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
కేంద్రపాలిత ప్రాంతాలు, సిటీ రాష్ట్రాల కేటగిరీలో  టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చంఢీగడ్​ నిలిచింది. ఆ తర్వాత ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఢిల్లీ, అండమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ & నికోబార్ ఐలాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. గోవాను ఇదే కేటగిరీ కింద ర్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐదో ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఇచ్చారు.  లడఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లోని రాష్ట్రాల కేటగిరీలో మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలవగా, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. స్కూళ్లు, రీసెర్చ్ సెంటర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయడంలో, సేఫ్టీ& లీగల్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్రియేట్ చేయడంలో మణిపూర్ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. కరోనా ప్రభావం 31.1 కోట్ల మంది విద్యార్ధులపై పడిందని, స్కూళ్లు, కాలేజిలు లేకపోవడంతో  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగా పెరిగిందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. కిందడేడాది జూన్ నాటికి దేశంలో ఇంటర్నెట్ వాడుతున్నవారి సంఖ్య 83.37 కోట్లకు చేరుకుంది. 2050‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి అర్బన్ పాపులేషన్ 81.4 కోట్లకు పెరుగుతుందని  ఈ రిపోర్ట్ అంచనావేసింది. 

మెరుగైన తెలంగాణ..
ఇన్నొవేషన్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అన్ని సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లలో అదరగొట్టింది. ఈ ఇన్నొవేషన్ రిపోర్ట్ ప్రకారం,  రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ అండ్‌‌‌‌‌‌‌‌ కమ్యూనికేషన్ (ఐసీటీ) ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌   ఉన్న స్కూళ్లు 17 శాతం నుంచి 35 శాతానికి పెరిగాయి. అంతేకాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ పరంగా చూసినా ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్స్ పెరిగాయి. ప్రైవేట్ ఆర్ అండ్ డీ యూనిట్లు (ప్రతి లక్షకు) 0.3 నుంచి 1.4 కు పెరగడంతో నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ ఉన్న వర్కర్లు క్రియేట్  చేయడంలో రాష్ట్ర సామర్ధ్యం మెరుగుపడిందని నీతి ఆయోగ్ పేర్కొంది. పేటెంట్‌‌‌‌‌‌‌‌లు, ట్రేడ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌లు, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌ వంటివి రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో ఫైల్ అయ్యాయి.  అంతేకాకుండా రాష్ట్రంలోని స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు గతంలో 4,900 ఉండగా ప్రస్తుతం  9 వేలకు పెరిగాయి. కానీ, పెరిగిన నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ వర్కర్లను ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు,  సర్వీస్‌‌‌‌‌‌‌‌ల అవుట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడంలో రాష్ట్రం ఎఫెక్టివ్‌‌‌‌‌‌‌‌గా వాడుకోలేకపోయిందని నీతీ ఆయోగ్ ఇన్నొవేషన్ ఇండెక్స్ పేర్కొంది.