
న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్‌లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టెస్లాకు కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాట్లు చేసుకునేందుకు టెస్లాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైజినా డైలాగ్ 2021లో పాల్గొన్న గడ్కరీ.. టెస్లాతోపాటు వెహికిల్ స్క్రాపేజ్ పాలసీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ బ్యాటరీల్లో భారత్ మెరుగవుతున్న తీరు లాంటి అంశాల గురించి మాట్లాడారు. ‘టెస్లా మేనేజ్‌మెంట్‌తో నేను వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడా. భారత్‌లో మానుఫ్యాక్చరింగ్‌ను మొదలుపెట్టడానికి ఇది సువర్ణావకాశం అని వారికి సూచించా. ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పటికే మన దేశం నుంచి పలు విడి భాగాలను దిగుమతి చేసుకుంటోంది’ అని పేర్కొన్నారు. టెస్లా మానుఫ్యాక్చరింగ్‌ను ప్రారంభించకపోతే ఆ కంపెనీ స్టాండర్ట్స్‌తో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను రూపొందించే మిగిలిన సంస్థలకు అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు.