డీజిల్ కార్లు, ఇతర వాహనాలపై అదనపు పన్ను: నితిన్ గడ్కరీ

డీజిల్ కార్లు, ఇతర వాహనాలపై అదనపు పన్ను: నితిన్ గడ్కరీ

డీజిల్ కార్లు, ఇతర వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదిస్తున్నట్లు  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ  వెల్లడించారు. ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు తాము అదనపు జీఎస్టీ విధించాలనుకుంటున్నామని చెప్పారు.  

న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడిన గడ్కరీ..  త్వరలో డీజిల్‌ వాహనాల ఉత్పత్తి తగ్గించాలని  లేకుంటే  అదనపు జీఎస్టీ  విధిస్తామన్నారు. అపుడు వాహనాలు అమ్మడం కూడా  మరింత కష్టమవుతుందని చెప్పారు.    కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ ఇవాళ ప్రకటన చేసిన వెంటనే  టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ షేర్లు 2.5 శాతం నుంచి 4 శాతం మధ్య పడిపోయాయి. ప్రస్తుతం వాహనాలకు 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కార్ల మార్కెట్ లో  భారత్ ప్రపంచంలోనే  మూడవ స్థానంలో ఉండడం విశేషం.

ఎయిర్ పొల్యూషన్ ను తగ్గించడానికి  ఎయిర్ క్వాలిటీ 400 మార్కును దాటితే, ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ మరియు గౌతమ్ బుద్ధ్ నగర్‌లలో BS III పెట్రోల్, BS IV డీజిల్ ఫోర్-వీలర్లను వెంటనే నిషేధించాలని ప్రభుత్వం ఇప్పటికే యోచిస్తోంది.