నిజామాబాద్ జిల్లాలో రెండు విడతల్లో స్థానిక పోరు

నిజామాబాద్ జిల్లాలో   రెండు విడతల్లో స్థానిక పోరు

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్లు కౌటింగ్ చేపట్టి అదే రోజు రిజల్ట్​ప్రకటించనున్నారు. మొదటి విడతలో బోధన్​, ఎడపల్లి, నవీపేట, సాలూరా, రెంజల్​, కోటగిరి, మోస్రా, పోతంగల్, రుద్రూర్, చందూర్, వర్ని, ధర్పల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ కలిపి 18 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఆ మండలాల పరిధిలోని177ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

 నామినేషన్లు అక్టోబర్ 9 నుంచి 11 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. స్ర్కూటినీ, విత్​డ్రా తర్వాత 15న మధ్యాహ్నం 3 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ప్రకటించి 23న పోలింగ్ నిర్వహిస్తారు.

సెకండ్​ ఫేజ్​లో 13 మండలాలు..

అక్టోబర్​ 27న రెండో ఫేజ్​లో ఆర్మూర్​, ఆలూర్, భీంగల్, బాల్కొండ,  డొంకేశ్వర్, జక్రాన్​పల్లి, కమ్మర్​పల్లి, మోర్తాడ్​, మెండోరా, నందిపేట, ముప్కాల్​, వేల్పూర్​, ఎర్గెట్ల 13 జడ్పీటీసీ స్థానాలు వాటి పరిధిలోని 130 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి నామినేషన్లు అక్టోబర్​ 13 నుంచి 15 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు.  స్ర్కూటినీ, విత్​డ్రా గడువు దాటాక 19న బరిలో ఉన్న అభ్యర్థుల లిస్టు ప్రకటించి 27న పోలింగ్ నిర్వహిస్తారు. 

ఒక విడతలో 281 జీపీలకు.. 

జిల్లాలో 545  గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులు ఉండగా, రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫస్ట్​ ఫేజ్​లో బోధన్​, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మోపాల్, నవీపేట, నిజామాబాద్ రూరల్​ కలిపి 15 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీలు, 2,510 వార్డులకు నవంబర్​ 4న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ నిర్వహించి 2 గంటల నుంచి కౌటింగ్ చేపట్టి రిజల్ట్​ ప్రకటిస్తారు. వాటి నామినేషన్లు అక్టోబర్​ 21 నుంచి 23 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్లు కౌటింగ్ చేపట్టి అదే రోజు రిజల్ట్​ప్రకటించనున్నారు. 

మొదటి విడతలో బోధన్​, ఎడపల్లి, నవీపేట, సాలూరా, రెంజల్​, కోటగిరి, మోస్రా, పోతంగల్, రుద్రూర్, చందూర్, వర్ని, ధర్పల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ కలిపి 18 జడ్పీటీసీ స్థానాలతో పాటు ఆ మండలాల పరిధిలోని177ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్లు అక్టోబర్ 9 నుంచి 11 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. స్ర్కూటినీ, విత్​డ్రా తర్వాత 15న మధ్యాహ్నం 3 గంటలకు పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ప్రకటించి 23న పోలింగ్ నిర్వహిస్తారు.

సెకండ్​ ఫేజ్​లో 13 మండలాలు..

అక్టోబర్​ 27న రెండో ఫేజ్​లో ఆర్మూర్​, ఆలూర్, భీంగల్, బాల్కొండ,  డొంకేశ్వర్, జక్రాన్​పల్లి, కమ్మర్​పల్లి, మోర్తాడ్​, మెండోరా, నందిపేట, ముప్కాల్​, వేల్పూర్​, ఎర్గెట్ల 13 జడ్పీటీసీ స్థానాలు వాటి పరిధిలోని 130 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి నామినేషన్లు అక్టోబర్​ 13 నుంచి 15 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు.  స్ర్కూటినీ, విత్​డ్రా గడువు దాటాక 19న బరిలో ఉన్న అభ్యర్థుల లిస్టు ప్రకటించి 27న పోలింగ్ నిర్వహిస్తారు. 

ఒక విడతలో 281 జీపీలకు.. 

జిల్లాలో 545  గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులు ఉండగా, రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫస్ట్​ ఫేజ్​లో బోధన్​, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, మోపాల్, నవీపేట, నిజామాబాద్ రూరల్​ కలిపి 15 మండలాల్లోని 281 గ్రామ పంచాయతీలు, 2,510 వార్డులకు నవంబర్​ 4న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ నిర్వహించి 2 గంటల నుంచి కౌటింగ్ చేపట్టి రిజల్ట్​ ప్రకటిస్తారు. వాటి నామినేషన్లు అక్టోబర్​ 21 నుంచి 23 ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు.

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. జిల్లాలో జడ్పీటీసీలు 25, ఎంపీటీసీలు 233, సర్పంచ్‌‌‌‌ 532, వార్డు మెంబర్లు 4,656 ఉన్నట్లు అధికారులు తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫస్ట్‌‌‌‌ ఫేజ్ అక్టోబర్ 23న కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌‌‌‌లోని 14 మండలాల్లో, సెకండ్‌‌‌‌ ఫేజ్ అక్టోబర్ 27న బాన్సువాడ డివిజన్‌‌‌‌లోని 11 మండలాల్లో జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నవంబర్ 4న 13 మండలాల్లో, నవంబర్ 8న 12 మండలాల్లో జరుగుతాయి. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫస్ట్ విడతలో ఎన్నికలు

ఫస్ట్‌‌‌‌ విడతలో అక్టోబర్ 23న జడ్పీటీసీలు 14, ఎంపీటీసీలు 136 ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికలు కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనర్, గాంధారి, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో జరగనున్నాయి. వీటి పరిధిలో మొత్తం 3,74,019 ఓటర్లు ఉన్నారు, అందులో పురుషులు 1,78,528, మహిళలు 1,95,487, ఇతరులు 4 మంది. 737 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9 నుంచి 
ప్రారంభమవుతుంది.

సెకండ్ ఫేజ్‌‌‌‌లో..

సెకండ్ ఫేజ్‌‌‌‌లో అక్టోబర్ 27న బాన్సువాడ డివిజన్ పరిధిలోని 11 జడ్పీటీసీ, 97 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. బాన్సువాడ, బీర్కుర్, నస్రుల్లాబాద్, బిచ్‌‌‌‌కుండ, డొంగ్లి, జుక్కల్, మద్నూర్, మహమ్మద్‌‌‌‌నగర్, నిజాంసాగర్, పెద్దకొడప్‌‌‌‌గల్, పిట్లం మండలాల్లో మొత్తం 2,65,711 ఓటర్లు ఉన్నారు, అందులో పురుషులు 1,28,980, మహిళలు 1,36,722, ఇతరులు 9 మంది. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని, పోలింగ్ అక్టోబర్ 23న జరగనుందని అధికారులు తెలిపారు. 

పంచాయతీ ఎన్నికలు ఇలా... 

జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.  2 విడతల్లో ఎన్నికలు చేస్తారు. సెకండ్​, థర్డ్​ ఫేజ్​లో ఎన్నికలు జరగనున్నాయి. 

నవంబర్​ 4న  పంచాయతీ ఎన్నికలు జరిగే  మండలాలు ఇవి.. 

దోమకొండ, పాల్వంచ, బీబీపేట,  భిక్కనూరు, రాజంపేట, సదాశివనగర్​, రామారెడ్డి, తాడ్వాయి, ఎల్లారెడ్డి,  నాగిరెడ్డిపేట, లింగంపేట.  మొత్తం 265 పంచాయతీలు. వార్డుల సంఖ్య.  2,340. అక్టోబర్​ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.  పోలింగ్​ తేది నవంబర్​4న.  

12 మండలాల్లో నవంబర్​ 8న ఎన్నికలు..

ఎల్లారెడ్డి డివిజన్​ పరిదిలోని గాంధారి మండలంతో పాటు , బాన్సువాడ డివిజన్లోని 11  మండలాల్లోని  266  గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య 2,316 లో   థర్ట్ ఫేజ్​ నవంబర్​ 8న ఎన్నికలు జరగనున్నాయి.  గాంధారి, బాన్పువాడ, బీర్కుర్​, నస్రుల్లాబాద్, జుక్కల్​, బిచ్​కుంద, మద్నూర్​, డొంగ్లి, నిజాంసాగర్​, మహమ్మద్​నగర్​, పిట్లం, పెద్దకొడప్​గల్ మండలాల్లో 8న ఎన్నికలు జరుగుతాయి.