చెల్లిని ప్రేమించాడని ప్రియుడిని కిడ్నాప్ చేసిన అన్న

చెల్లిని ప్రేమించాడని ప్రియుడిని కిడ్నాప్ చేసిన అన్న

తన చెల్లిని ప్రేమించాడని ప్రియుడిని కిడ్నాప్ చేశాడు ఓ అన్న.. ఈ ప్రేమ వ్యవహారం నిజామాబాద్ నుంచి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కలకలం రేపింది.  వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ సూర్యా నగర్ లో నివాసముంటున్న తనుష్ తన చెల్లి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉంటున్న ఉదయ్ రాజ్ ని ప్రేమిస్తుందని.. అతన్ని స్నేహితులతో కలసి  కిడ్నాప్ చేశాడు తనుష్. సాంస్కృతి టౌన్ షిప్ అన్నోజిగూడలో ఉదయ్ రాజ్ తన స్నేహితుల ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకున్న తనుష్ శనివారం(ఫిబ్రవరి 10) రాత్రి 8 గంటలకు అక్కడికి వెళ్లారు. అయితే బయటకు వెళ్దామని అతన్ని నమ్మించి కిడ్నాప్ కు యత్నించారు. 

ఉదయ్ రాజ్ పై దాడి చేసి, అతన్ని బెదిరించి.. తార్నాక ప్రాంతంలో వదిలి పెట్టారు కిడ్నాపర్లు.  గాయాలతో ఉదయ్ రాజ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఆదివారం(ఫిబ్రవరి 11) తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో కిడ్నాప్ కి గురైనట్లు ఉదయ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయాలతో బాధపడుతున్న అతన్ని ఘట్కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు. 

ALSO READ :- మురళీధర్ రావు బీఆర్ఎస్ కోవర్ట్.. అందుకే తట్టాబుట్టా ఇచ్చి పంపించాం : భట్టి విక్రమార్క

ఉదయ్ రాజ్ ఫిర్యాదుతో రంగంలోకి ప్రత్యేక పోలీస్ బృందాలు.. దర్యాప్తు చేపట్టి.. నిజామాబాద్ పట్టణంలో సూర్య నగర్ లో నివాసం తనుష్ తో పాటు అతని ముగ్గురు స్నేహితులు, వారి తల్లిదండ్రులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.