V6 News

1,384 మంది పోలీసులతో బందోబస్తు : సీపీ సాయిచైతన్య

1,384 మంది పోలీసులతో బందోబస్తు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా ముగియడానికి 1,384 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని  సీపీ సాయిచైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాలూరా, ఖండ్​గావ్​, పోతంగల్​ బార్డర్​ విలేజ్​ల్లో 24/7 నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బోధన్ డివిజన్​లోని 11 మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నామన్నారు. ఐదుగురికి మించి  గుమికూడడానికి వీలులేదన్నారు.

  ఇప్పటి వరకు రూ.2.57 లక్షల లిక్కర్​ పట్టుకున్నామని,  183 మందిని బైండోవర్ చేశామన్నారు. బ్యాంకు​లు మినహాయించి నాలుగు లైసెన్స్ గన్స్​ డిపాజిట్ చేయించామని తెలిపారు.  పోలీస్​ ప్రజావాణికి 24 ఫిర్యాదులుకమిషనరేట్ ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 24 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య బాధితులతో మాట్లాడి స్వయంగా వాటిని స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత ఠాణా ఎస్​హెచ్​వోలతో మాట్లాడి సూచనలు ఇచ్చారు. కేసులు నమోదు చేయాల్సిన తీరును వివరించారు.