లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో..లైసెన్స్ వెపన్స్ సరెండర్ చేయాలి : సీపీ సాయిచైతన్య

లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో..లైసెన్స్ వెపన్స్ సరెండర్ చేయాలి : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు : లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9లోపు లెసెన్స్​వెపన్స్ కలిగి ఉన్న వారు స్థానిక పోలీస్​స్టేషన్స్​లో అప్పగించాలని సీపీ సాయిచైతన్య మంగళవారం ఒక ప్రకటన పేర్కొన్నారు. కోడ్ అమలులో ఉండగా​ఎవరూ రివాల్వర్, గన్ కలిగి ఉండడానికి వీలులేదని తెలిపారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

అర్ధరాత్రి నగరంలో తనిఖీలు..

నగరంలో సోమవారం అర్ధరాత్రి సీపీ సాయిచైతన్య తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, నెహ్రూ చౌక్​, శివాజీనగర్, కంఠేశ్వర్, దేవీరోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో అకారణంగా రోడ్లపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్​ఇచ్చి పంపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.