V6 News

ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు : నిజామాబాద్ సీపీ సాయిచైతన్య

ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు : నిజామాబాద్ సీపీ సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు: ర్యాగింగ్​కు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య హెచ్చరించారు. గురువారం నిజామాబాద్​ మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్, సైబర్​క్రైమ్​అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సైబర్​ నేరాలు, సోషల్​మీడియా పట్ల అలర్ట్​గా ఉండాలన్నారు. 

డ్రగ్స్​గురించి తెలిస్తే టోల్​ఫ్రీ నంబర్​1908కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రిన్సిపాల్ ​కృష్ణమోహన్​ ర్యాగింగ్​, డ్రగ్స్,​ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఏసీపీ బి.ప్రకాశ్, ఆర్​ఎన్​సీసీ డీఎస్పీ సోమనాథం, ఈగిల్​సెల్​ఏసీపీ వెంకటేశ్వర్​రావు పాల్గొన్నారు.