ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

దుర్గమ్మ తల్లీ.. సల్లంగ చూడు..

మెండోరా, వెలుగు: జగన్మాత దీవెనలతో జిల్లా ప్రజలు చల్లగా ఉండాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆకాంక్షించారు. మెండోరా మండలం దూద్ ‌‌ ‌‌గాం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపంలో శుక్రవారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అమ్మవారికి బోనాల సమర్పించారు. ఆయన వెంట బాల్కొండ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ మల్లికార్జున్ ‌‌ ‌‌రెడ్డి పాల్గొన్నారు.

అమ్మవారికి కుంకుమార్చన

దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల్లో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. హౌజింగ్​బోర్డు కాలనీ, విద్యానగర్, అశోక్​నగర్, రైల్వే స్టేషన్​ఏరియా తదితర ఏరియాల్లో నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగాయి. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. - కామారెడ్డి, వెలుగు

మెంగారం జీపీలో నిధుల దుర్వినియోగం
అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

లింగంపేట, వెలుగు: మండలంలోని మెంగారం  పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు చెందిన రూ.48 వేల నిధులు దుర్వినియోగం అయినట్లు అస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై శుక్రవారం పంచాయతీ ఆఫీస్ ‌‌ ‌‌తో సర్పంచ్ మహేశ్ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఇక్కడ కారోబార్ ‌‌ ‌‌ ‌‌ ‌‌గా పని చేస్తున్న తంతిరి గణేశ్ పేరు మీద జూనియర్ పంచాయతీ సెక్రటరీ సావిత్రి రూ.48 వేల చెక్కును రాసి ఇవ్వగా అతను తన ఖాతా నుంచి డబ్బులను డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. తనకు తెలియకుండా కారోబార్​పేరిట చెక్కును ఎలా ఇచ్చారని సర్పంచ్ ‌‌ ‌‌ సెక్రటరీని ప్రశ్రించగా ఆ విషయం తనకు తెలియదని దాట వేశారు. దీంతో సర్పంచ్ సదరు కారోబార్ ఖాతాలో జమ అయిన బ్యాంక్ స్టేట్ ‌‌ ‌‌మెంట్ ‌‌ ‌‌ను చూపించి నిలదీశారు. అయితే కారోబార్ గణేశ్ మాత్రం తాను డబ్బులు తెచ్చి సర్పంచ్, ఉప సర్పంచులకు ఇచ్చానని  చెప్పాడు. దీంతో సర్పంచ్ తాను డబ్బులు తీసుకుంటే బ్యాంక్​స్టేట్ మెంట్ ఎందుకు తెస్తానని ఆగ్రహం వ్యక్తం జేశారు. దీంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయంపై ఎంపీవో ప్రభాకర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌చారిని ప్రశ్నించగా జీపీ నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు అందిందని విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

వీఆర్ఏలు లేక గ్రామాల్లో ఇబ్బందులు

డిచ్​పల్లి, వెలుగు: వీఆర్ఏలు విధులు బహిష్కరించి సమ్మె చేస్తుండడంతో గ్రామాల్లో తీవ్ర ఇబ్బందలు ఎదురవుతున్నాయని మండల సర్పంచ్ ‌‌ ‌‌లు, ఎంపీటీసీలు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్ ‌‌ ‌‌కు మెమోరాండం అందజేశారు. చెరువులు, కాల్వల పరిరక్షణ దెబ్బతినడంతో పాటు కాస్ట్, ఇన్ ‌‌ ‌‌కం సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందన్నారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్​ వెంకటరమణ, బీజేవైఎం జిల్లా సెక్రటరీ సతీశ్ ‌‌ ‌‌రెడ్డి, వైస్​ఎంపీపీ శ్యాంరావు, సర్పంచ్ ‌‌ ‌‌లు రూపా సతీశ్ ‌‌ ‌‌రెడ్డి, రాజ్ ‌‌ ‌‌కుమార్ ‌‌ ‌‌ ‌‌ ‌‌, ఎంపీటీసీలు సంతోషం, సుధీర్​, లీడర్లు చంద్రకాంత్, రవీందర్, గంగారెడ్డి, వినోద్ ‌‌ ‌‌రెడ్డి పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు కేసీఆర్ కానుక

లింగంపేట, వెలుగు: బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుక అని జడ్పీటీసీ ఏలేటీ శ్రీలత సంతోష్ ‌‌ ‌‌రెడ్డి అన్నారు. శుక్రవారం లింగంపేట జడ్పీ హైస్కూల్ ‌‌ ‌‌లో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఏం కేసీఆర్ ఆడపడుచులకు ఓ అన్నగా బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వడం గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా,  ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సర్పంచ్ బొల్లు లావణ్య, ఉప సర్పంచ్​ కౌడ రవీందర్, ఎంపీడీవో నారాయణ, ఎంపీవో ప్రబాకర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌చారి, మండల కోఆప్షన్ మెంబర్ బాబుజానీ, ఎంపీటీసీ షమ్మి మున్నీసా, టీఆర్ఎస్​  నాయకులు రాంరెడ్డి, నయీం, నరేశ్ ‌‌ ‌‌, సాయిరాం, సాజిద్ తదితరులు  పాల్గొన్నారు.

పరిశోధక కేంద్రం ఏర్పాటుకు సహకరిస్తాం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెమినార్ల నిర్వహణ, పరిశోధన  కేంద్రం ఏర్పాటుకు టీయూ నుంచి సహకారం అందిస్తామని వీసీ రవీందర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌ గుప్తా పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీకి ఇటీవల న్యాక్ ‌‌ ‌‌లో ఏ గ్రేడ్ సాధించినందుకు శుక్రవారం లెక్చరర్లు వీసీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాక్  గ్రేడ్ ‌‌ ‌‌లో కామారెడ్డి డిగ్రీ కాలేజీ స్టేట్ ‌‌ ‌‌లో రెండో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను కాలేజీలో ప్రవేశపెట్టాలన్నారు. అటానమస్​కాలేజీగా ఎదిగేందుకు సహకరిస్తామని చెప్పారు. ప్రిన్సిపాల్ కె.కిష్టయ్య, వైస్​ప్రిన్సిపాల్ చంద్రకాంత్, లెక్చరర్లు రామకృష్ణ, వి.శంకర్ కలిసిన వారిలో ఉన్నారు. 

పండుగ అయిపోయినా.. బతుకమ్మ చీరలు రాలే..! 

కోటగిరి, వెలుగు: మండలంలోని కొన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగ అయిపోయినా చీరలు పంపిణీ కాలేదు. ఇప్పటికే ఎత్తొండ, పొతంగల్, యాద్గార్ ‌‌ ‌‌ ‌‌ ‌‌పూర్, కల్లూర్ గ్రామాల్లో బతుకమ్మ పండుగ అయిపోయింది. ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకే గ్రామంలో కొందరికీ మాత్రమే చీరలు పంపిణీ చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొతంగల్ గ్రామంలో  2,200 మంది మహిళలు ఉంటే కేవలం 1300 చీరలు మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కోటగిరి మండలంలో మొత్తం 19 వేల మంది మహిళలు ఉండగా ఇప్పటివరకు కేవలం 8,300 చీరలు మాత్రమే వచ్చాయని, మిగతావి పైనుంచి రాలేదని వచ్చాక పంచుతామని ఇన్ ‌‌ ‌‌చార్జి ఎంపీడీవో మారుతి తెలిపారు.

ఖానాపూర్ ‌‌‌‌‌‌‌లో కార్డన్ ‌‌ ‌‌ సెర్చ్ ‌‌ ‌‌

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్ మండలం ఖానాపూర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌లో శుక్రవారం డీసీపీ అరవింద్ ‌‌ ‌‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం కార్డన్ ‌‌ ‌‌ సెర్చ్ ‌‌ ‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు, నంబర్ ప్లేట్ లేని 46 బైక్ ‌‌లు, ఏడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం నిర్వహించిన మీటింగ్ ‌‌ ‌‌లో డీసీపీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ‌‌ ‌‌ తప్పకుండా పాటించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆన్ ‌‌ ‌‌లైన్ ‌‌ ‌‌లో ఎవరైనా సమాచారం అడిగినట్లయితే ఇవ్వరాదన్నారు. కార్యక్రమంలో ఒకటో డివిజన్ కార్పొరేటర్ లలిత గంగాధర్, ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆరో రోజూ సాగిన సంబురం..

వెలుగు, నిజామాబాద్ ‌‌ ‌‌/కామారెడ్డి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు వారసత్వమైన బతుకమ్మ పండుగ ఉమ్మడి నిజామాబాద్ ‌‌ ‌‌ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆరో రోజైన శుక్రవారం కూడా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలాడారు. కామారెడ్డిలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్  వెంకటేశ్​దొత్రే, డీఆర్డీవో సాయన్న, సీపీవో రాజరాం,  టీజీవో, టీఎన్జీవోస్ ‌‌ ‌‌ ప్రతినిధులు సంబురాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ ‌‌ ‌‌లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, నగర మేయర్ నీతూ కిరణ్, మహిళా కార్పొరేషన్ ‌‌ ‌‌ చైర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌పర్సన్ ‌‌ ‌‌ ఆకుల లలిత, జీజీహెచ్ ‌‌ ‌‌ సూపరింటెండ్ంట్ ‌‌ ‌‌ ప్రతిమారాజ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సునీత పాల్గొన్నారు. - 

బిల్లులు రావడం లేదు.. ఏమిచేద్దాం!
బోధన్ మండల సర్పంచుల ఆవేదన

బోధన్, వెలుగు: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు, కొత్తరేషన్ కార్డులు, ఫించన్ ‌‌ ‌‌లు, డబుల్​బెడ్ రూం ఇండ్లు మంజూరు కావడంలేదని పలువురు సర్పంచ్ ‌‌ ‌‌లు ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్​ మండల సర్పంచ్ ‌‌ ‌‌ల సంఘం అధ్యక్షుడు మద్దినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్పంచ్ ‌‌ ‌‌లు ఎంపీడీవో ఆఫీసు వద్ద సమావేశం నిర్వహించారు. ఊళ్లలో ఎలాంటి పనులు కాకపోవడంతో గ్రామాల్లో తిరగలేని  పరిస్థితి నెలకొందని అన్నారు. తమ సమస్యలను ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లేందుకు కలిసి కట్టుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో బోధన్​ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్ ‌‌ ‌‌లు పాల్గొన్నారు.

బస్టాండ్ మరమ్మతులకు రూ.46 లక్షలు

లింగంపేట, వెలుగు: లింగంపేటలోని ఆర్టీసీ బస్టాండ్​ మరమ్మతుల కోసం రూ.46 లక్షల నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం బస్టాండ్ ‌‌ ‌‌లో తాగునీటి కోసం బోర్ డ్రిల్లింగ్ పనులను స్థానిక ఎంపీపీ గరీబున్నిసా, జడ్పీటీసీ శ్రీలత, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్టాండ్ ‌‌ ‌‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ‌‌ ‌‌కు  వివరించగా రూ.46 లక్షలను మంజూరు చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా బస్టాండ్ రిపేర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌తో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, సీసీరోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీటీసీ షమ్మి మున్నీసా, ఎల్లారెడ్డి మార్కెట్​కమిటీ వైస్ చైర్మన్ నరహరి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్, యూత్​ అధ్యక్షుడు నరేశ్ ‌‌ ‌‌, టౌన్ అధ్యక్షుడు పోకల సాయిరాం, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.


బిచ్కుందలో ‘ఉర్డూ’ కాలేజీ షురూ

బిచ్కుందలో, వెలుగు: బిచ్కుందలో ఏర్పాటు చేసిన ఉర్డూ మీడియం జునియర్ కాలేజీని ఎమ్మెల్యే హన్మంత్​షిండే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్​ నియోజకవర్గంలో ఉర్డూ మీడియం టెన్త్ వరకు మాత్రమే ఉందని, స్టూడెంట్లకు పైచదువులకు ఇబ్బందులు కలుగకుండా బిచ్కుందకు కాలేజీని మంజూరు చేయించినట్లు చెప్పారు.  బీపీసీ, ఎంపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అనంతరం మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్​సలాం, ఎంపీపీ అశోక్ ‌‌ ‌‌ పటేల్ ‌‌ ‌‌, కాలేజీ ప్రిన్సిపాల్​నరేందర్, కోఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.

పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలి

నిజామాబాద్, వెలుగు: దరఖాస్తు చేసుకున్న పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ ‌‌ ‌‌ క్లబ్ ‌‌ ‌‌లో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2006 అటవీ హక్కుల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్ అధ్యక్షత జరిగిన ఈ ప్రోగ్రామ్ ‌‌ ‌‌లో ప్రభాకర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌ మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టాల అమలు కోసం కూడా పోరాటాలు చేయాల్సిన  పరిస్థితి రావడం దారుణం అన్నారు. ఇప్పటికైనా పాలకుల తీరు మారకుంటే రాబోయే రోజుల్లో వారికి పతనం తప్పదన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు బి.దేవారం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సురేశ్ ‌‌ ‌‌, సహాయ కార్యదర్శులు కె.రాజేశ్వర్, సిహెచ్.సాయగౌడ్, పుట్టి నాగన్న, పి.రాజేశ్వర్, ఆర్.రమేశ్ ‌‌ ‌‌ కిషోర్,  నడిపి మల్లన్న, జి.కిషన్,  గంగరాం, ప్రజాపంథా నాయకులు మల్లేశ్ ‌‌ ‌‌, రాజేశ్వర్ పాల్గొన్నారు.

కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం

బోధన్, వెలుగు: కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ  పోరాటం చేయాలని సీపీఐ (ఎంఎల్) బోధన్ డివిజన్​ కార్యదర్శి బి.మల్లేశ్ ‌‌ ‌‌ పిలుపునిచ్చారు. శుక్రవారం బోధన్ మండలంలోని ఖాజాపూర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌లో కుల వ్యవస్థ నిర్మూలనపై సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా కొన్ని ప్రాంతాలలో నేటికి అంటరానితనం, అణిచివేత, అత్యాచారాలు, హత్యాకాండ కొనసాగుతున్నాయన్నారు. సాటి మనిషిని మనిషిగా చూడడం లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సత్యశోధక్​సమాజ్ స్ఫూర్తితో సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు కుల నిర్మూలన చైతన్యం సదస్సులు,  ప్రచారాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖజాపూర్​ సర్పంచ్ నాగన్న, నాయకులు పడాల శంకర్, ఆర్.ఎల్లన్న, గంగారాం, భీమ్ ‌‌ ‌‌రావ్ ‌‌ ‌‌, పీరాజీ, లక్ష్మీబాయి, గంగారాం, సాయి,  రమేశ్ ‌‌ ‌‌ పాల్గొన్నారు.  

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

నందిపేట, వెలుగు: పోడు, సాగు భూములకు ఎలాంటి ఆంక్షలు లేకుండా పట్టాలివ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్ డిమాండ్​ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరికొండ మండలంలో కోర్టు తీర్పు ఇచ్చినా ఫారెస్టు అధికారులు రైతులను అడ్డుకోవడం సరికాదన్నారు. పోడు చేసుకుంటున్న వారికే పట్టాలు ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బైన మల్లయ్య, రాజలింగం, దేవయ్య, దశరథ్ ‌‌ ‌‌, పోశెట్టి పాల్గొన్నారు.