రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్​, వెలుగు: ఈ నెల 10, 11,12వ తేదీల్లో హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్​గర్ల్స్​హాకీ పోటీల్లో పాల్గొనే నిజామాబాద్​జిల్లా జట్టును మంగళవారం ఆర్మూర్​లో ఎంపిక చేశారు. మినీ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్స్ లో 40 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ప్రతిభ కనబరిచిన 18 మందితో కూడిన ఫైనల్​జట్టును ఎంపిక చేశారు.

చీఫ్​గెస్ట్​గా ఆర్మూర్ మున్సిపల్ చైర్​పర్సన్​గోనె లహరి, వైస్ చైర్​పర్సన్ కాట్​పల్లి  వెంకటరెడ్డి హాజరై ఎంపికైన జట్టును అభినందించారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ, కౌన్సిలర్ సోను, ఫిజికల్ డైరెక్టర్స్ నాగేశ్, సంతోష్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.