హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​

హిందువులు భయపడేలా కాంగ్రెస్​ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్​

బోధన్​,వెలుగు: కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో  హిందుసమాజం భయపడే విధంగా ఉందని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అన్నారు. మంగళవారం బోధన్​ పట్టణంలోని రాకాసిపేట్​లో బీజేపీ  ఆఫీస్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.   కాంగ్రెస్​   దేశంలోని సంపదను దోచిపెట్టి, ముస్లింలకు  పంచడానికి సిద్ధమైందన్నారు.  65 ఏండ్లలో   జరగని అభివృద్ది బీజేపీ పదేండ్ల లో   చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్​  నాయకులకు  బీజేపీ చేసిన అభివృద్ధి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. 

 మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు  అన్ని వర్గాలకు అందాయని చెప్పారు.  కాంగ్రెస్​ పార్టీ హిందువులపై ఎందుకు కక్ష్య పెంచుకుందో తెలియడంలేదన్నారు. ఆ   పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మరిచిపోయిందన్నారు.  అలాగే బీఆర్​ఎస్​  కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు అవినీతి  చేసినా  రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

  ఆనంతరం వీరహనుమాన్​ జయంతి ఉత్సవాల్లో  ఆయన పాల్గొన్నారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​ కులకర్ణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు మేడపాటి ప్రకాష్​ రెడ్డి, మోహన్​ రెడ్డి,బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాల్​ రాజ్​,  నాయకులు సుధకార్​చారి, మేక సంతోష్ పాల్గొన్నారు.