
నిజామాబాద్, వెలుగు : జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం భారీగా పోలీసుల బదిలీ జరిగింది. 2018 నుంచి ఒకే చోట పని చేస్తున్న 116 మంది కానిస్టేబుల్స్, ఒకే ఠాణాలో నాలుగేండ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న 26 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మూడేండ్ల నుంచి ఒకే స్టేషన్లో కొనసాగుతున్న 22 మంది ఏఎస్సైలు కలిపి మొత్తం 164 మందిని సీపీ ట్రాన్స్ఫర్ చేశారు.
కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆయన తక్షణమే కొత్త ఠాణాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టాఫ్ సమస్యలు తెలుసుకోడానికి సీపీ ప్రత్యేకంగా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బదిలీలు చేపట్టారు.