తల్లిదండ్రులపై ప్రేమను వినూత్నంగా చూపిన రైతు

తల్లిదండ్రులపై ప్రేమను వినూత్నంగా చూపిన రైతు

నిజామాబాద్ కు చెందిన ఓ రైతు తనకు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటి చెప్పాలనుకున్నాడు.ఆ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో వరినారు మడిలో తల్లిదండ్రుల చిత్రపటాలను ఆవిష్కరించాడు. డ్రోన్ కెమెరా ద్వారా తీసిన ఈ అరుదైన అపురూప దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు.. ఇతను ఇప్పటి వరకు వివిధ రకాల వంగడాలు, కొత్త కొత్త పంటలు సాగు చేస్తూ పంటల సాగులో అందరికీ ఆదర్శంగా నిలిచారు. 

అయితే తాజాగా తన తల్లి భూదేవి, తండ్రి ముత్తెన్న చిత్రాలను పొలంలో రూపొందించాడు. బంగారు గులాబీ పంచరత్న చింతలూర్ సన్నాలు వంటి వరి వంగడలతో ఈ చిత్రాలను వేయడం విశేషం. వరినారు పెరిగే కొద్దీ చిత్రాలు కూడా ఇంకా స్పష్టంగా కనబడేలా రూపొందించడం చిన్ని కృష్ణుడి ప్రత్యేకత.. ఈ వినూత్న దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.