నిజామాబాద్, వెలుగు: ఈ ఏడాది 7వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. రైతు వేదికల ద్వారా ఆయిల్‌పామ్ పంటకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.
2022 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,375 మంది రైతులు 6,164 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేయగా 1,476 ఎకరాల్లో పంట కోతలు జరుగుతున్నాయన్నారు. ఆయిల్‌పామ్ రైతులకు నాలుగేండ్లపాటు ఎకరానికి సర్కార్ నుంచి ఆర్థిక తోడ్పాటు అందుతుందన్నారు.
