నిజామాబాద్, వెలుగు: సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల సేకరణలో నిజామాబాద్ జిల్లా ఏడేండ్లుగా మొదటి స్థానం పొందుతోంది. ఈ ఏడాది కూడా ప్రథమ స్థానం దక్కించుకోవడంతో గవర్నర్ జిష్ఞుదేవ్ వర్మ శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్‌కు ట్రోఫీ అందజేశారు. ఆ ట్రోఫీని శనివారం కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి చూపించగా అభినందించారు.
